- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల రోజులకే ఓటీటీలోకి రాబోతున్న ‘8 వసంతాలు’ సినిమా.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందంటే? (ట్వీట్)
‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ (Anantika Sunil Kumar)నటించిన లేటెస్ట్ మూవీ ‘8 వసంతాలు’(8 vasantalu).

దిశ, సినిమా: ‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ (Anantika Sunil Kumar)నటించిన లేటెస్ట్ మూవీ ‘8 వసంతాలు’(8 vasantalu). ఫణీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రంలో అనంతిక శుద్ధి అయోధ్య పాత్రలో కనిపించగా.. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల(Ravi Teja Duggirala) కీలక పాత్రలో నటించారు. అంతమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 20న భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ హిట్ అందుకోలేకపోయింది.
అయినప్పటికీ ఇందులోని అనంతిక నటనకు ప్రేక్షకులంతా మంత్రముగ్దులయ్యారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘8 వసంతాలు’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు ప్రముఖ సంస్థ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. జూలై 11 నుంచి తెలుగు, తమిళ, కన్నడ అండ్ మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ పోస్ట్‌కు ‘‘తను ప్రేమించింది... ఓడిపోయింది.. ఎదిగింది’’ అనే క్యాప్షన్ జత చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు.






