నన్ను ఏడిపించిన ఏకైక సినిమా అదే.. ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ హన్సిక ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? షూటింగ్స్ ఎలా జరుగుతాయి? అనే విషయాలన్నీ ఆయనే నాకు నేర్పించారు

నన్ను ఏడిపించిన ఏకైక సినిమా అదే.. ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ హన్సిక ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఒకప్పుడు తన గ్లామర్‌తో, నటనతో కుర్రాళ్ల గుండెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నటి హన్సిక మోత్వానీ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ, తెలుగులో తన తొలి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న హన్సిక, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదలైన నాటి మధుర జ్ఞాపకాలను పంచుకుంది. ముఖ్యంగా తన మొదటి తెలుగు సినిమా ‘దేశముదురు’ షూటింగ్ సమయంలో జరిగిన ఎమోషనల్ విషయాలను గుర్తు చేసుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి హన్సిక గొప్పగా చెప్పుకొచ్చింది. "బన్నీ ఒక అద్భుతమైన వ్యక్తి. అందరికీ చాలా గౌరవం ఇస్తారు. ‘దేశముదురు’ చేసేటప్పుడు నేను చాలా చిన్నపిల్లని. అది తెలిసి ఆయన నన్ను ఒక మంచి స్నేహితుడిలా చూసుకున్నారు. సెట్‌లో నేను ఇబ్బంది పడకుండా చాలా కంఫర్టబుల్‌గా ఉంచేవారు. షూటింగ్ బ్రేక్స్‌లో ఇద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? షూటింగ్స్ ఎలా జరుగుతాయి? అనే విషయాలన్నీ ఆయనే నాకు నేర్పించారు" అని హన్సిక తెలిపింది.

ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం మనాలీలో జరిగిన సంగతి తెలిసిందే. అక్కడి వాతావరణం, షూటింగ్ అనుభవాల గురించి చెబుతూ.. "మనాలీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు దర్శకుడు పూరీ జగన్నాథ్ గారు, ఆయన భార్య, మా అమ్మ, అల్లు అర్జున్.. మేమంతా కలిసి భోజనం వండుకునేవాళ్ళం. అప్పట్లో అదొక షూటింగ్ సెట్‌లా కాకుండా ఒక చిన్న కుటుంబంలా ఉండేది. అందుకే ఆ సినిమా నా గుండెకు చాలా దగ్గరైంది" అని వివరించింది. తన కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినా, ఒక మూవీ ప్యాకప్ అయ్యాక తాను ఏడ్చిన సందర్భం ఒక్క ‘దేశముదురు’ విషయంలోనే జరిగిందని హన్సిక ఎమోషనల్ అయ్యింది. "షూటింగ్ పూర్తయ్యాక క్రూ మొత్తానికి వీడ్కోలు చెబుతుంటే నా కన్నీళ్లు ఆగలేదు. నా లైఫ్‌లో ఒక షూటింగ్ అయిపోయాక ఏడ్చిన ఏకైక సినిమా అదే. అప్పుడు మేము ముంబైలోని ఒక బంగ్లాలో ఉండేవాళ్ళం. ‘దేశముదురు’ చేస్తున్న సమయంలోనే నాకు బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు వచ్చాయి" అని చెప్పుకొచ్చింది. హన్సిక చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story