69వ జాతీయ చలన చిత్ర అవార్డులు.. సత్తా చాటిన తెలుగు సినిమాలు

by Disha Web Desk 2 |
69వ జాతీయ చలన చిత్ర అవార్డులు.. సత్తా చాటిన తెలుగు సినిమాలు
X

దిశ, వెబ్‌డెస్క్: 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా 6 అవార్డులను సొంతం చేసుకోగా, పుష్ప రెండు అవార్డులను సాధించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక కాగా.. ఈ అవార్డు అందుకోబోతున్న తొలి తెలుగు నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. ఉత్తమ సంగీతం, ఉత్తమ సాహిత్యం విభాగాల్లోనూ తెలుగు పరిశ్రమ సత్తా చాటింది. ఇక ఈ 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఏడు భాషలు పోటీ పడగా.. 30 సినిమాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో తెలుగు సినిమా మొదటిసారి ఏకంగా 10 అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం.

ఉత్తమ నటుడు= అల్లు అర్జున్ (పుష్ప)

ఉత్తమ నటి= అలియా భట్, కృతిసనన్

ఉత్తమ సినిమా= రాకెట్రీ (ది నంబి ఎఫెక్ట్)

ఉత్తమ సహాయ నటుడు= పంకజ్ త్రిపాఠి(మిమి)

ఉత్తమ సహాయ నటి= పల్లవి జోషి(కశ్మీర్ ఫైల్స్)

ఉత్తమ బాలనటుడు= రాహుల్ కొలి(చెల్లో షో)

ఉత్తమ దర్శకుడు= నిఖిల్ మహాజన్(గోదావరి)

ఉత్తమ ఎన్విరాన్‌మెంట్ కన్జర్వెంట్ ఫిల్మ్= ఆవాస వ్యూహం

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్= ఉప్పెన (తెలుగు)

ఉత్తమ కొరియోగ్రాఫర్= ప్రేమ్ రక్షిత్ మాస్టర్ (ఆర్ఆర్ఆర్)

ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్= కింగ్ సోలోమన్( ఆర్ఆర్ఆర్)

ఉత్తమ సంగీత దర్శకుడు= దేవీ శ్రీ ప్రసాద్ (పుష్ప)

ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్= కీరవాణి(ఆర్ఆర్ఆర్)

ఉత్తమ సాహిత్యం= చంద్రబోస్(కొండపొలం)

బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్(తెలుగు)= పరుషోత్తమా చార్యులు

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్= సర్దార్ ఉద్దం(హిందీ)

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్= 777 చార్లీ (కన్నడ)

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్= హోమ్ (మలయాళం)

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్= కడసై వివసాయి (తమిళం)

బెస్ట్ స్ర్కీన్ ప్లే రైటర్= సంజయ్ లీలా భన్సాలీ, ఉత్కర్షిని విశిష్ట

బెస్ట్ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్= శ్రేయా గోషల్

బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్= కాల భైరవ

వీరికి త్వరలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందించనున్నారు.

ఇవి కూడా చదవండి : జాతీయ ఉత్తమ నటుడిగా Allu Arjun.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?



Next Story

Most Viewed