మహేష్‌ బాబు సరసన నటించాల్సిన వయసు నాది.. 50 ఏళ్ల బుల్లితెర స్టార్ నటి సంచలన కామెంట్స్

by Disha Web Desk 9 |
మహేష్‌ బాబు సరసన నటించాల్సిన వయసు నాది.. 50 ఏళ్ల బుల్లితెర స్టార్ నటి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి పలు చిత్రాల్లో నటించి, ఇండస్ట్రీకి దూరమైంది నటి కస్తూరి శంకర్. పరిశ్రమలో హీరోయిన్ గా చాలా తక్కువ కాలం కొనసాగినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ లో తులసి పాత్రలో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకుల వద్ద ప్రశంసలు అందుకుంటుంది. కస్తూరి మరోవైపు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తుంది.

ఇకపోతే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు, సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ.. అప్పుడప్పుడు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే తాజాగా నటి కస్తూరి ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ‘జెంటిల్‌మెన్ మూవీ హిందీ రీమేక్ లో నాకు అవకావం వచ్చింది.

కానీ ఆ సమయంలో టైఫాయిడ్ వచ్చిన కారణంగా చేయలేకపోయాను. సీనియర్ హీరో మోహన్ బాబు సరసన కూడా ఓ సినిమాలో చాన్స్ వచ్చినా ఏదో కారణంతో చేయలేకపోయాను. అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలో అయితే మూడు సార్లు అవకాశం వచ్చింది. కానీ నాకు నటించడానికి కుదరలేదు. చివరగా కాలా మూవీలో నటించాలని చాలా బతిమిలాడారు. కానీ రజనీకాంత్ పక్కన యంగ్ గా కనిపిస్తుండటంతో తీసేశారు. డెవిల్ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన మరీ యంగ్ అయిపోయానని తీసేశారు.

నాది మహేష్ బాబు జోడిగా చేయాల్సిన వయసు. తల్లి పాత్రలో నటించాలంటే ఇంకో 30 ఏళ్లు ఆగాల్సిందే’’. అంటూ నటి కస్తూరి చెప్పుకొచ్చింది. కస్తూరి కామెంట్స్ విన్న జనాలు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘పోనీ సుమ కుమారుడు శ్రీకాంత్ కొడుకు, సునీత కుమారుడు సరసన చాన్స్ లు ఇస్తే చేస్తావా? అసలు ఇలాంటి ఇంటర్వ్యూలు ఎలా ఎంకరేజ్ చేస్తారో అర్థం కాదు. కానీ చాలా ఫన్నీ ఆన్సర్స్ చెప్పింది కస్తూరి. కళ్యాణ్ రామ్ కు 45 ఏళ్లుంటే.. ఈమెకు 50 ఉంటాయి. యంగ్ కనిపిస్తుందట. వెరీ ఫన్నీ.. అంటూ కస్తూరి పై నెటిజన్లు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story

Most Viewed