- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడిని పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన స్టార్ సింగర్.. ఫొటోలు వైరల్
మలయాళ స్టార్ సింగర్ ఆర్య దయాళ్(Arya Dayal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ సింగర్ ఆర్య దయాళ్(Arya Dayal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక తెలుగులో ‘బేబీ’ సినిమాలో ఓ లవ్ పాట పడింది. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ జంటగా నటించిన ఈ చిత్రంలో ‘ఓ రెండు ప్రేమ మేఘలిలా’ ప్రేమ పాటను పాడి సెన్సేషనల్‌గా మారింది. తెలుగులో ఆర్య దయాళ్ మొదటి పాట అయినప్పటికీ ఎక్కువ వ్యూస్ రాబట్టింది. అంతేకాకుండా ఆర్య టాలీవుడ్‌లో అభిమానులను భారీగానే సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఆర్య దయాళ్ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి పెళ్లి పీటలెక్కింది. గత కొద్ది కాలంగా అభిషేక్(Abhishek)తో ప్రేమలో ఉన్న ఆమె సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని షాకిచ్చింది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు కూడా రాకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఫొటోలు షేర్ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన పెళ్లి సర్టిఫికెట్‌ను చూపుతూ తన భర్తతో పాటు ఉన్న పిక్స్ ఇన్‌స్టాలో పెట్టడంతో కొత్త దంపతులకు నెటిజన్లు కంగ్రాట్ చెబుతున్నారు.






