- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్య కారణంగా షూటింగ్ సెట్ లోనే ఏడ్చేసిన స్టార్ హీరోయిన్..
అలనాటి అందాల తారా నటి లయ గురించి అందరికి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి అందాల తారా నటి లయ గురించి అందరికి తెలిసిందే. దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసున నటించిన ఆమె తక్కువ కాలంలోనే ఎక్కువ స్టార్డమ్‌ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేసింది లయ. ఇదిలా ఉంటే.. వెండితెరపై కనుమరుగైనప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు దగ్గరవుతుంది. అయితే తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన లయ.. అప్పుడు షూటింగ్‌లో జరిగిన సన్ని వేశాలను గుర్తుచేసుకున్నారు.
లయ మాట్లాడుతూ.. ‘నందమూరి బాలకృష్ణతో ‘విజయేంద్ర వర్మ’ సినిమా చేశాను. ఆ సినిమాలో ఫస్ట్ సాంగ్ షూటింగ్‌లో అనుకోకుండా బాలయ్య కాలు తొక్కేసాను. అయ్యే సారీ సార్ అని చెప్పే లోపే ఆయన సీరియస్ అయ్యి.. నా కాలే తొక్కుతావా షూటింగ్ క్యాన్సిల్ అన్నారు. ఆ మాటతో నా వల్లే షూటింగ్ క్యాన్సిల్ అయిందని బాధతో నేను ఏడ్చేశాను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన నా దగ్గరికి వచ్చి నేను సరదాగా అన్నా అంటూ నవ్వేశారు’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. బాలయ్య బాబుపై లయ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.






