చరణ్‌కు జోడీగా శ్రీలీల.. దర్శకుడు బుచ్చిబాబు కన్ఫర్మ్ చేశాడా?

by Disha Web Desk 9 |
చరణ్‌కు జోడీగా శ్రీలీల.. దర్శకుడు బుచ్చిబాబు కన్ఫర్మ్ చేశాడా?
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో మొన్నటి వరకు యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరి చూపు రష్మిక మందన్న, సమంత, పూజా హెగ్డే మీద ఉండేది. కానీ ఇప్పుడు రూట్ మారింది. అంతా శ్రీలీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే డజనుకు పైగా సినిమాల్లో నటిస్తున్నా.. ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, బుచ్చి బాబు సనా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌లో శ్రీలీల ఓకే అయినట్టు సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇటీవల ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల, బుచ్చిబాబు పాల్గొన్నారు. ఇందులో భాగంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఈసారి అచ్చ తెలుగు మాట్లాడే అమ్మాయిని నా సినిమాలో తీసుకుంటాను’ అంటూ ఆమె వైపు చూస్తూ చెప్పారు. దీంతో కన్ఫర్మ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

Next Story

Most Viewed