Pushpa-2 ఐటెమ్ సాంగ్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలిస్తే షాక్

by Disha Web Desk 9 |
Pushpa-2 ఐటెమ్ సాంగ్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలిస్తే షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప-2. ప్రస్తుతం బన్నీ ఈ చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే పుష్ప మొదటి భాగంలో వచ్చిన ‘‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా మావ’’ ఐటెమ్ సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో ఓ ఊపు ఊపేసింది. ఈ పాటకు సమంత స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దాన్ని మించేలా పార్ట్ 2లో ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా బాలీవుడ్ నటి ఊర్వసి రౌతాలా నటించనుందని కొన్నాళ్లుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో ఐటెం సాంగ్ చేయడానికి ఈ భామ ఏకంగా రూ.౭ కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో మేకర్స్ ఆ సాంగ్ కోసం ఏడు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్తపై సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

Read More..

నువ్వు సౌత్ ఇండియన్ మియా ఖలీఫా.. అనసూయను ఏకంగా పోర్న్ స్టార్‌తో పోల్చుతూ ట్రోల్స్



Next Story

Most Viewed