డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సమంత బాటలో ప్రభాస్

by Disha Web Desk 7 |
డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సమంత బాటలో ప్రభాస్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి 2898ఏడీ’ షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రభాస్ గురించి ఓ షాకింగ్ న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే..

ప్రభాస్ ఈ మధ్య కాలంలో కాళ్లతో నొప్పులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ‘ఆదిపురుష్’ సినిమా టైంలో కూడా ప్రమోషన్స్ అప్పుడు నడవలేని స్థితిలో ప్రభాస్‌ను చూసి అభిమానులు షాక్ అయ్యారు. అయితే.. ఈ మధ్య ప్రభాస్ కాళ్లకు సర్జరీ చేయించుకునేందుకు ఫారిన్ కంట్రీస్ వెళ్లబోతున్నట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఈ కారణం చేతనే ప్రభాస్ తాత్కలికంగా సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడట. తన హెల్త్ కండిషన్ బాగోలేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అంతే కాదు.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సినిమాను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. డార్లింగ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నెట్టింట నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కొందరు మాత్రం సమంత బాటలో ప్రభాస్ కూడా ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ తీసుకోనున్నట్లు ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read : పోలీస్ స్టేషన్‌కు అనుష్క శెట్టి.. తల్లిదండ్రులతో కలసి వారిపై ఫిర్యాదు?



Next Story

Most Viewed