మొదటి సారి కొడుకు అరెస్ట్‌పై స్పందించిన షారుఖ్ ఖాన్.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్

by Disha Web Desk 6 |
మొదటి సారి కొడుకు అరెస్ట్‌పై స్పందించిన షారుఖ్ ఖాన్.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ గత ఏడాది గాంధీ జయంతి రోజున మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వివాదం కాస్త కోర్ట్ వరకు వెళ్లి ఆర్యన్ ఖాన్‌కు క్లిన్ చిట్ ఇచ్చింది. దీంతో షారుఖ్ ఖాన్‌ కుటుంబంతో సహా ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. షారుఖ్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. గత ఏడాది ఆయన నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. తాజాగా, షారుఖ్ ఖాన్‌కు ఇండియన్ ఆఫ్ దిఇయర్ 2023 అవార్డ్ వచ్చింది.

దీంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుఖ్ ఖాన్ మొదటి సారి కొడుకు అరెస్ట్‌పై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘గత నాలుగు, ఐదు సంవత్సరాలు నాకు, నా కుటుంబానికి ఎన్నో సవాళ్లను పరిచయం చేశాయి. నా సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. చాలా మంది విశ్లేషకులు నా సినీ కెరీర్ ముగిసి పోయిందంటూ వార్తలు రాశారు. కొంతమంది ఇడియట్స్ మరీ దారుణంగా విశ్లేషణలు చేశారు. తప్పుడు విశ్లేషణల పట్ల బాధ పడకపోయినా, కొన్నిసార్లు ఇబ్బంది కలిగించాయి. అయినప్పటికీ వాటి గురించి నేను ఏనాడు బయట చెప్పలేదు. సైలెంట్ గా నా పని నేను చేసుకుంటూ వెళ్లాను. ఇప్పుడు మళ్లీ సక్సెస్ బాట పట్టాను. మళ్లీ అందరూ పొగడ్తలు కురిపిస్తున్నారు.

ప్రతి మనిషి జీవితంలో ఇబ్బందులు వస్తుంటాయి, పోతుంటాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి. మన పని కచ్చితంగా చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. ఇదే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. అవార్డులు అనేవి ప్రతి వ్యక్తిలో ఉత్సాహాన్ని నింపుతాయి. మరింత బాధ్యతగా ఉండాలని గుర్తు చేస్తుంటాయి. నాకు వచ్చిన ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డును నా కుటుంబానికి అంకితం ఇస్తున్నాను. కొద్ది సంవత్సరాల క్రితం నాకు అవార్డులు వచ్చినప్పుడు వాటిని నా పిల్లలకు బహుమతిగా ఇవ్వాలి అనుకున్నాను. అది వాళ్ల జీవితంలో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. గత 5 సంవత్సరాలుగా నా కుటుంబం నాకు ఎంతో అండగా నిలిచింది. అందుకే ఈ అవార్డును నా ఫ్యామిలీకి అంకితం చేయాలి అనుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారు ఈ కామెంట్స్ షారుఖ్, ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌పై ఇండైరెక్ట్‌గా చేశారని అనుకుంటున్నారు.

Next Story