Sundeep Kishan: విజయవాడ వరద బాధితులకు ఫుడ్, వాటర్ సప్లై చేస్తున్న సందీప్ కిషన్ టీం

by Phanindra |   (  Updated:2024-09-04 14:36:22  IST  )

విజయవాడ వరద బాధితులకు ఫుడ్, వాటర్ సప్లై చేస్తున్న సందీప్ కిషన్ టీం

Sundeep Kishan: విజయవాడ వరద బాధితులకు ఫుడ్, వాటర్ సప్లై చేస్తున్న సందీప్ కిషన్ టీం
X

దిశ, వెబ్ డెస్క్: వారం నుంచి కురుస్తున్న వానలకు విజయవాడ (vijayawada) సగం మునిగిపోయింది. అక్కడ ఉండే ప్రజలు ఎవరి ఇళ్ళకు వారు వెళ్లలేని పరిస్థితి. సింగ్ నగర్, ఆ చుట్టు పక్క పలు ప్రదేశాలలో జల ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ప్రజలు ఎటు వెళ్లాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం సహాయక చర్యలు చేస్తుండగా .. ప్రజలు ఫుడ్, నీళ్లు, పాల.. వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంతో పాటు NGO సంస్థలు, ప్రముఖులు, నటీ నటులు వారికి ఫుడ్, వాటర్.. లాంటివి అందజేస్తున్నారు.

ఈ క్రమంలో హీరో సందీప్ కిషన్ (sundeep kishan) తన టీమ్ ని విజయవాడకు పంపించి అక్కడి ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు. యువత కొందరు సుందీప్ కిషన్ టీమ్ లాగా అక్కడికి వెళ్లి వారికీ కావాల్సిన ఫుడ్ సప్లై చేస్తున్నారు. IAS లక్ష్మీశ కూడా వీరిని అభినందించారు. దీంతో సుందీప్ కిషన్ మీద ఫ్యాన్స్ , నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Click Here For Twitter Link


Next Story