Kushi: రొమాన్స్ స్టార్ట్ చేసిన సమంత.. వీడియో వైరల్..

by Disha Web |
Kushi: రొమాన్స్ స్టార్ట్ చేసిన సమంత.. వీడియో వైరల్..
X

దిశ, వెబ్‌డెస్క్: మహానటి సినిమా తర్వాత మరోసారి విజయ్ దేవరకొండ(Vijay devarakonda), సమంత(Samantha) జంటగా నటిస్తున్న రొమాంటిక్ చిత్రం 'ఖుషి'. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 'ఖుషి(KUSHI)' సినిమా నుండి టైటిల్ ట్రాక్ విడుదలైంది. దీన్ని విజయ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కాశ్మీర్‌లో షూట్ చేస్తున్నప్పుడు సమంత, విజయ్ కలిసి ఉన్న ఖుషీ ట్రాక్ ప్రోమో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో పంచుకున్నాడు. ఈ చిత్రం దాదాపు 20 రోజుల పాటు కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకోనుంది. టైటిల్ ట్రాక్‌ను పంచుకుంటూ, విజయ్ దేవరకొండ ఇలా రాశాడు, "మేము అమితమైన ప్రేమతో హత్తుకున్నాము. ఈ ప్రేమను ఈ క్రిస్మస్‌లో మేము పెద్ద స్క్రీన్‌పైకి తీసుకువస్తాము - న్యూ ఇయర్స్ ఈలోగా, మీరు 'ఖుషి' ఇష్టపడే మా టైటిల్ ట్రాక్ ఇదిగోండి. డిసెంబర్. 23 ప్రపంచవ్యాప్తంగా తెలుగు - తమిళం - కన్నడ - మలయాళం."లో విడుదల కానుంది. వీడియోను చూసిన వారంతా లైక్ చేస్తూ.. మీ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాము అంటూ కామెంట్లతో తెలుపుతున్నారు.

Next Story