తన ట్రీట్‌మెంట్ గురించి అప్‌డేట్ ఇచ్చిన సమంత

by samatah |
తన ట్రీట్‌మెంట్ గురించి అప్‌డేట్ ఇచ్చిన సమంత
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. యూఎస్ఏలో ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తాజాగా ఆమె తన హెల్త్‌ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంది. ఆ వ్యాధికి సంబంధించిన నెలవారీ ఇంట్రావీనస్‌ ఇమ్యూనో గ్లోబలిన్‌ థెరపీ (IVIG) సెషన్‌కు హాజరైనట్లు తన ఇన్‌స్టా స్టేటస్‌లో 'న్యూ నార్మల్‌' అంటూ షేర్ చేసింది. ఈ థెరపీ మయో సైటిస్‌‌తో బాధపడుతున్న వారి శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్‌ను సమర్థంగా పనిచేయించడంతో పాటు, ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా సహాయపడుతుంది. అందుకే సమంత ఈ ట్రీట్ మెంట్‌ను తన ఇంట్లోనే తీసుకుంటోంది.

Next Story