Sai Pallavi: ఆ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన నేచురల్ బ్యూటీ.. కారణం ఏంటంటే..?

by I. Sairam |   (  Updated:2025-01-13 06:33:19  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) ప్రస్తుతం ‘వీర ధీర శూరన్-2’('Veera Dheera Sooran-2') సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Sai Pallavi: ఆ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన నేచురల్ బ్యూటీ.. కారణం ఏంటంటే..?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) ప్రస్తుతం ‘వీర ధీర శూరన్-2’('Veera Dheera Sooran-2') సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అరుణ్(Arun) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 31న విడుదల కానున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎస్ జే సూర్య(SJ Surya), సూరజ్ వెంజర మూడు(Suraj Venjaramoodu), దుషారా విజయన్(Dushara Vijayan), సిద్ధిక్(Sidhik) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే విక్రమ్ ఈ మూవీ తర్వాత.. మడోన్ అశ్విన్(Madon Ashwin) దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభం కాగా, ఈ సినిమా షూటింగ్ వేసవి నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ మూవీ కోసం నటించే నటీనటుల కోసం వెతుకుతున్నారు.

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విక్రమ్- మడోన్ అశ్విన్ కాంబోలో వస్తున్న మూవీలో హీరోయిన్‌గా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi)ని సెలెక్ట్ చేశారట మేకర్స్. అయితే ఇదే విషయం గురించి ఆ ముద్దుగుమ్మను సంప్రదించగా.. ఆ డేట్స్‌కి కాల్షీట్ లేకపోవడంతో సున్నితంగా సినిమాకి నో చెప్పిందట. దీంతో విక్రమ్ సరసన ప్రియాంక మోహనన్‌(Priyanka Mohanan)ను ఎంపిక చేయాలని మూవీ టీం భావిస్తుందట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story