99 సార్లు అడిగాడు.. ఇవ్వక తప్పలేదు.. ప్రముఖ డైరెక్టర్ గురించి హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Dishafeatures3 |
99 సార్లు అడిగాడు.. ఇవ్వక తప్పలేదు.. ప్రముఖ డైరెక్టర్ గురించి హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ రిచా చద్దా తాజాగా ' హీరామండి' సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ఈ సిరీస్ నంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుండగా.. ఇందులో ముఖ్యపాత్రల్లో కనిపించిన హీరోయిన్లు వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే రిచా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుభవాలు షేర్ చేసుకుంది. ప్రముఖ దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ గురించి గొప్పగా చెప్పింది.

'ఈ సినిమాలో ఒక సీన్ కోసం 99 టేక్స్ తీసుకున్నా. నిజానికి ఇది కష్టమే కానీ డైరెక్టర్ గారు ఒక్క సన్నివేశాన్ని ఎంత ఇమాజిన్ చూసుకుంటారో.. ఎలా ప్రెజెంట్ చేయాలని అనుకుంటారో అలాగే ఉండలనుకున్నా. నాకు కూడా నేను చేసేది సరిగ్గా లేదు అనిపించింది. మొత్తానికి చాలా కష్టపడ్డాం. వందో సారి ఔట్ పుట్ బాగుంది అనడంతో హ్యాపీగా ఫీల్ అయ్యా ' అని తెలిపింది. కాగా ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, మనీషా కోయిరాలా, అదితి రావు హైదరీ, సాజిద ప్రధాన పాత్రల్లో కనిపించి మెప్పించారు.

Next Story

Most Viewed