- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
RGV Shari Teaser: భారీ అంచనాలు పెంచుతోన్న ఆర్జీవీ ‘శారీ’ టీజర్
దిశ, వెబ్‌డెస్క్: ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే ప్రముఖ డైరెక్టర్, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ దర్శకుడు ఏం మాట్లాడినా అది సోషల్ మీడియా సెన్సేషన్. ఇటీవల ఆర్జీవీ ఐశ్వర్యరాయ్ కు ఓ పెద్ద మెసేజ్ పెట్టాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అందమైన అమ్మాయిలు గర్భవతి అయితే తాను భరించలేనని.. ఎందుకంటే వారు ప్రెగ్నెంట్ అయితే షేప్ పోతుందని, పిల్లల్ని కనడానికే ఆడవాళ్లని భగవంతుడు పుట్టించాడనే భావన ఆర్జీవీకి చిరాకు తెప్పిస్తుందని, ఆ ఆలోచన సరైంది కాదంటూ ఆర్జీవీ వెల్లడించారు.
ఇకపోతే రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో శారీ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గత ఏడాది సోషల్ మీడియాలో చీర కట్టుకుని ఫొటో షూట్స్ చేసిన ఓ మలయాళీ అమ్మాయిని వెతికి మరీ ఆర్జీవీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ గమనించినట్లైతే.. ఓ అందమైన అమ్మాయి, అమ్మాయిని గాఢంగా ప్రేమించే అబ్బాయి.. ప్రేమ ఎక్కువైతే సైకోలా బిహేవ్ చేసే అబ్బాయిలా టీజర్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట జనాల్ని ఆకట్టుకుంటోంది.