రీల్ పాపా అనేవాడు.. అమితాబ్‌పై రష్మిక కామెంట్స్

by Disha Web |
రీల్ పాపా అనేవాడు.. అమితాబ్‌పై రష్మిక కామెంట్స్
X

దిశ, సినిమా: ర‌ష్మిక మంద‌న్నా, లెజెండ‌రీ స్టార్ అమితాబ్ బ‌చ్చన్‌ కాంబినేష‌న్‌లో రాబోతున్న హిందీ చిత్రం 'గుడ్ బై'. ఈ నెల 7న థియేట‌ర్లలో సంద‌డి చేయ‌నుండగా.. ప్రమోషన్స్‌‌తో బిజీగా ఉంది మూవీ టీమ్. ఇక బిగ్ బీతో కలిసి ప‌నిచేయడం ప‌ట్ల తన ఎగ్జైట్‌మెంట్‌ను అనేకసార్లు అభిమానులతో పంచుకున్న రష్మిక తాజా పోస్ట్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

అమితాబ్‌తో షూటింగ్ స్పాట్‌లో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. 'ఇది జ‌రుగుతుందని నేను ఇప్పటికీ న‌మ్మలేక‌పోతున్నా.అమితాబ్ సర్‌తో సినిమా పూర్తయింది. ఆయనతో మాట్లాడటం, ఒకే వేదికను పంచుకోవడం, ఫొటో తీసుకోవ‌డం.. మై గాడ్‌..' అంటూ పోస్ట్‌లో ప్రస్తావించింది. అంతేకాదు బిగ్‌బీని అద్బుతమైన ప‌ర్‌ఫార్మర్‌ అంటూ ఆకాశానికెత్తిన రష్మిక.. ఎప్పుడూ రీల్ పాపా అంటూ తనతో వాదించేవారని వెల్లడించింది. అయినప్పటికీ ఆయనతో 'గుడ్‌బై' సినిమా చేసే అవకాశం దక్కినందుకు దేవుడికి కృత్పజ్ఞతలు తెలిపింది.

ఇవి కూడా చదవండి : దసరా కానుకగా 'జిన్నా' ట్రైలర్

Next Story

Most Viewed