ఆస్తి మొత్తం అమ్మేసుకున్న రాజమౌళి ఫ్యామిలీ.. తన వదిన వల్లే ఈ పరిస్థితిలో..

by Dishafeatures3 |
ఆస్తి మొత్తం అమ్మేసుకున్న రాజమౌళి ఫ్యామిలీ.. తన వదిన వల్లే ఈ పరిస్థితిలో..
X

దిశ, సినిమా : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు. హాలివుడ్ డైరెక్టర్స్ సైతం తనను కలిసేందుకు తపించిపోయేలా చేశాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్న జక్కన్న.. ఈ సినిమాకు సెట్ అయ్యే ఫిజిక్ కోసం సూపర్ స్టార్ ను బాగానే కష్టపెడుతున్నాడు. ఆయన మరింత యంగ్ గా కనిపించేలా ప్లాన్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే జక్కన్నకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆయన పదేళ్ల వయసున్నప్పుడు కుటుంబానికి కర్ణాటకలో 360 ఎకరాల భూమి ఉండేదట. చాలా రిచ్ గా బతికేవారట. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ మొత్తాన్ని అమ్మేసి చెన్నై వెళ్ళిపోవాల్సి వచ్చిందట. అక్కడ సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లో 13 మంది ఉంటుండగా.. తన పెద్దన్న ఒక్కడు పని చేసి కుటుంబ సభ్యుల కడుపు నింపేవాడట. తనకు 21ఏళ్లు వచ్చేసరికి పెద్దన్నకు పెళ్లి అయి ఇంటికి వదిన వచ్చిందట. కానీ తనను అమ్మ అని పిలిచేంత గొప్పగా చూసుకునేదట. అయితే అప్పటికీ జక్కన్న ఖాళీగా తిరుగుతుండటం చూసిన ఒక ఆంటీ తిట్టడంతో.. తన కొడుకును ఇలా ఎవరూ అనకూడదని బాధ పడిందట వదినమ్మ. అంతే ఆ మాటతో పూర్తిగా మారిపోయానని తెలిపిన రాజమౌళి.. ఆమె వల్లే తను ఈ స్థాయిలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed