పూజా హెగ్డే కెరీర్ నాశనం చేసింది ఆ స్టార్ హీరోనా.. బయటపడ్డ సంచలన విషయాలు!

by Disha Web Desk 6 |
పూజా హెగ్డే కెరీర్ నాశనం చేసింది ఆ స్టార్ హీరోనా.. బయటపడ్డ సంచలన విషయాలు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే అందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగింది. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, వంటి స్టార్స్‌తో నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాల్లో నటించి తన క్రేజ్ పెంచుకుంది. అయితే ఈ అమ్మడు టాలీవుడ్ బుట్టబొమ్మ గా గుర్తింపు తెచ్చుకుని కుర్రాళ్లను కట్టిపడేసింది. కానీ కొద్ది కాలంగా పూజా హెగ్డేకు బ్యాడ్ టైమ్ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో ఆఫర్లు కూడా రావడం లేదు. అలాగే పూజాను ట్రోల్ చేస్తున్నారు.

అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోలు షేర్ చేస్తూ హీట్ పుట్టిస్తోంది. దీంతో ఇప్పుడిప్పుడే పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. తాజాగా, పూజా హెగ్డేకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె కెరీర్ నాశనం కావడానికి ఓ కోలీవుడ్ స్టార్ హీరో హస్తం ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆయనతో సినిమా చేశాకనే అన్ని ఫ్లాప్స్ వచ్చాయని తెలుస్తోంది. దీంతో అతడి వల్లే పూజా కెరీర్ రిస్క్‌లో పడిందని అంతా చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా పరోక్షంగా ఆ హీరో వల్లే పూజా కెరీర్ నాశనం అయిందని అంటున్నారు.

Next Story

Most Viewed