- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గొప్ప మనసు.. తీసుకున్న అడ్వాన్స్ మొత్తం ఆ నిర్మాతకు తిరిగి అప్పగింత!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్స్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి మూవీస్ చేస్తున్నారు.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్స్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనుపమ్ కేర్, అనసూయ, పూజా పొన్నాడ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 12న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. హరి హర వీరమల్లు మూవీ నిర్మాత రత్నం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న పవన్ తీసుకున్న అడ్వాన్స్‌కు వెనక్కి తిరిగి ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు రూ. 11 కోట్లు తీసుకున్న ఆయన వెనక్కి తిరిగి ఇవ్వడంతో పాటు సినిమా విడుదలపై ప్రెషర్ తీసుకోకుండా రిలీజ్ చేసుకోమని రత్నంకు చెప్పారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈవిషయం తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు పవన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, సిద్దు జొన్నలగడ్డ కూడా జాక్ సినిమాకు తీసుకున్న పారితోషికంలోని రూ. 4.75 కోట్లలో సగం నిర్మాతకు తిరిగి ఇచ్చిన విషయం తెలిసిందే.






