ప్రేమికుల రోజున 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' రీ రిలీజ్

by samatah |
ప్రేమికుల రోజున నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీ రిలీజ్
X

దిశ, సినిమా: తెలుగు ప్రేక్షకుల మనసులో సూపర్ హిట్‌గా నిలిచిపోయిన అందమైన ప్రేమకథ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'. ప్రభుదేవా దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈ సినిమాలో సిద్ధార్థ్, త్రిష జంటగా నటించారు. అప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి భారీగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాను ప్రేమికుల రోజు సందర్భంగా ఈ ఫిబ్రవరి 14న 4కే వెర్షన్‌తో రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇంకో విషయం ఏమిటంటే రీ రిలీజ్ ప్రమోషన్ కోసం హీరో హీరోయిన్, డైరెక్టర్ కూడా రంగంలోకి దింపబోతున్నారని టాక్ నడుస్తోంది.

Next Story

Most Viewed