వాళ్లను కించపరిచే సినిమాలు నేను ఎప్పటికీ చేయను.. నసీరుద్దీన్ షా

by Disha Web Desk 10 |
వాళ్లను కించపరిచే సినిమాలు నేను ఎప్పటికీ చేయను.. నసీరుద్దీన్ షా
X

దిశ, సినిమా: స్త్రీలను కించపరుస్తూ పితృస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా చూపించే సినిమాల్లో ఎప్పుడూ పని చేయనంటున్నాడు నసీరుద్దీన్ షా. రీసెంట్‌గా ఓ సమావేశంలో జెండర్ ఇక్వాలిటీ గురించి మాట్లాడిన ఆయన.. నటీనటులు తమ నమ్మకాలకు విరుద్ధంగా ఉండే సినిమాల్లో పాల్గొనకూడదని సూచించాడు. ‘మహిళలను తక్కువ చేసి మాట్లాడే లేదా పురుషాధిక్యత సమాజాన్ని ప్రోత్సహించే చిత్రాల్లో నేను ఎప్పటికీ భాగం కాను. ఎందుకంటే నటీనటులు తమ అభిప్రాయాలను ప్రజలకు తెలియజేయడం చాలా ముఖ్యమని భావిస్తా. అయితే అలా చేయడానికి ఇప్పటికీ చాలామంది భయపడుతున్నారు. ముఖ్యంగా మహిళా నటులు’ అన్నాడు. అలాగే ‘ది కేరళ స్టోరీ’ని జర్మనీ నాజీ (హిట్లర్‌)పాలనతో పోలుస్తూ విమర్శలు గుప్పించిన నటుడు.. ఇలాంటి కథలను ‘ప్రమాదకరమైన ధోరణి’గా పేర్కొన్నాడు.

Read More... డైరెక్టర్‌తో కలిసి ఆ హీరో అందరి ముందే అలా చేశాడు..పుస్తకంలో అలా రాసుకున్న నటి!


Next Story

Most Viewed