ఈ వయసులో ఇదేం పనిరా బాబు.. యంగ్ హీరోయిన్‌తో నాగార్జున హగ్‌లు, కిస్‌లపై నెట్టింట రచ్చ (వీడియో)

by Disha Web Desk 7 |
ఈ వయసులో ఇదేం పనిరా బాబు.. యంగ్ హీరోయిన్‌తో నాగార్జున హగ్‌లు, కిస్‌లపై నెట్టింట రచ్చ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండ్రస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోహీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న వారు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా దూసుకుపోతున్నారు. అయితే.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్టార్ హీరోయిన్స్ సైడ్ క్యారెక్టరో లేక, సినిమాలో కీలక పాత్రలోనో మెరుస్తున్నారు. కానీ హీరోలు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా యంగ్ హీరోస్‌ల ఇప్పుడు ఉన్న కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ముద్దులు, హగ్‌లతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే మన సీనియర్ హీరోలు అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా నాగార్జున చేసిన పనితో ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు.

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ప్రస్తుతం.. బిగ్ బాస్ సీజన్ 7కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం, ఆదివారం వచ్చే ఎపిసోడ్‌కు నాగార్జున ఓ సాంగ్‌తో ఎంట్రీ ఇస్తాడు. ఈ క్రమంలోనే మన నవ మన్మధుడు ఇటీవల ఎంట్రీ సాంగ్‌లో డ్యాన్స్ చేస్తూ కో డాన్సర్‌కు ముద్దు ఇచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యంగ్ హీరోయిన్‌కు హగ్, ముద్దు ఇచ్చి మరోసారి నెట్టంట రచ్చ చేస్తున్నాడు. నవరాత్రి పండుగ వేడుకలకు కళ్యాణ్ అనే వ్యక్తి ఇంటికి హాజరయ్యాడు నాగార్జున. ఆ పండుగ వేడుకలకు కత్రినా కైఫ్ కూడా హాజరు కావడంతో.. ఆమెను రిసీవ్ చేసుకునే క్రమంలో నాగార్జున హగ్, కిస్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఈ వయసులో ఇదేం పనిరా బాబు.. అంటూ నెట్టింట నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.


Next Story

Most Viewed