Nagarjuna కారణంగా.. ఇండస్ట్రీ ఎంట్రీలోనే సూపర్ హిట్ మూవీని వదులుకున్న Naga Chaitanya..

by Disha Web Desk 7 |
Nagarjuna కారణంగా.. ఇండస్ట్రీ ఎంట్రీలోనే సూపర్ హిట్ మూవీని వదులుకున్న Naga Chaitanya..
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస ప్లాప్‌లతో సతమత మవుతున్నాడు. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా చైతుకి బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. అయితే.. దిల్ రాజు నిర్మాణంలో 2009లో వచ్చిన ‘జోష్’ సినిమాతో చైతు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా వచ్చిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక చైతు వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్న రోజుల్లో ఆయన వద్దకు మొదట వచ్చిన సినిమా ‘కొత్త బంగారు లోకం’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాతో నాగచైతన్యను ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం అనుకున్నారట శ్రీకాంత్ అడ్డాల. ఈ క్రమంలోనే దిల్ రాజు ద్వారా చైతుకి ఆ కథ వినిపించారట. కానీ, నాగచైతన్యకు ఈ కథ సెట్ కాదని ఆలోచనతో నాగార్జున రిజక్ట్ చేశారట. కాగా.. పెదకాపు ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీకాంత్ అడ్డాల చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



Next Story