రెండో పెళ్లిపై స్పందించిన మీనా..ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుందని కామెంట్స్!

by Disha Web Desk 8 |
రెండో పెళ్లిపై స్పందించిన మీనా..ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుందని కామెంట్స్!
X

దిశ, సినిమా : సీనియర్ స్టార్ హీరోయిన్ మీన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈముద్దుగుమ్మ ఎన్నో చిత్రల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇప్పటి వారికి కూడా ఈ నటి అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇక మీన సినిమాల విషయంలో ఎంత ఫర్ఫెక్ట్‌గా ఉండేదో తన పర్సనల్ లైఫ్‌ను కూడా అంతే అందంగా తీర్చిదిద్దుకుంది. వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా గడిపేది. అంతే కాకుండా వీరి ప్రేమకు గుర్తుగా ఓపాప కూడా జన్మించింది. వీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉండేవారు. కానీ ఎవరూ ఊహించని విధంగా మీన భర్త గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

ఆ సంఘటన నుంచి బయటపడిన మీన ఇప్పుడిప్పుడే తన కెరీర్‌పై ఫొకస్ పెట్టింది. ఈ క్రమంలో మీనా రెండో పెళ్లి అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే తాజాగా రెండో పెళ్లిపై నటి స్పందించి, షాకింగ్ కామెంట్స్ చేసింది. నా భర్త చనిపోతారని నేను అస్సలు అనుకోలేదు, ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడగలుగుతున్నాను. కానీ రెండో పెళ్లి వార్తలు నన్ను చాలా బాధిస్తున్నాయి. ముఖ్యంగా హీరో ధనుష్ తో అఫైర్ కొనసాగిస్తోంది అని మీడియాలో ఒక వార్త వచ్చింది. ధనుష్ తో నాకు సంబంధం అంటగట్టడం దురదృష్టకరమని ఆమె చెప్పారు. జీవితంలో ఏది ఎప్పుడు జరుగుతుందో ఎవరం చెప్పలేము, నా భర్త చనిపోతారని నేను ఊహించలేదు,ప్రస్తుతం నా లైఫ్ గురించి కూడా నేను ఏమి ఆలోచించడం లేదు. భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనా..ఎంత మంది ఒంటరిగా ఉండటం లేదు. నేను అంతే అంటూ రెండో పెళ్లిపై స్పందించింది. అంతే కాకుండా నాకు పాప, ఫ్యామిలీ ఉంది. మేము విషాదంలోనే ఉన్నాం.. ఇలాంటి వార్తలతో మమ్ముల్ని మరింత ఇబ్బంది పెట్టకూడదు అంటూ కోరింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story