- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు రోజుల్లో భారీ కలెక్షన్లు రాబట్టిన ‘కింగ్‌డమ్’.. మూవీ మేకర్స్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్‌డమ్’(Kingdom).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్‌డమ్’(Kingdom). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. దీనిని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. సత్యదేవ్, వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు.
ఈ సినిమా భారీ అంచనాల మధ్య జులై 31న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తాజాగా, ‘కింగ్‌డమ్’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో రివీల్ చేస్తూ మూవీ మేకర్స్ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమా నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.82 కోట్లు రాబట్టినట్లు తెలుపుతూ విజయ్ నిల్చొని కోపంగా చూస్తున్న పోస్టర్ వెనకాల ఎవరో మాస్క్ పెట్టుకుని ఉన్నారు. ప్రస్తుతం మూవీ మేకర్స్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






