ఎన్టీఆర్ ‘దేవర’తో చేతులు కలుపుతున్న కరణ్ జోహార్.. బాయ్ కాట్ అనరుగా..

by Disha Web Desk 7 |
ఎన్టీఆర్ ‘దేవర’తో చేతులు కలుపుతున్న కరణ్ జోహార్.. బాయ్ కాట్ అనరుగా..
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘దేవర’. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్స్, పోస్టర్లు అభిమానుల్లో ఆసర్తిని రెట్టింపు చేశాయి. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీపై మరో అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది.

దేవర నిర్మాతలతో నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడం ఎంతో సంతోషంగా ఉందంటూ బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ మేరకు ‘గొప్ప వినోదం యొక్క మాస్ హరికేన్ చాలా దగ్గరలోనే ఉంది. మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’లో నన్ను భాగంచేసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. భారతీయ చలనచిత్రంలో తదుపరి అతిపెద్ద సినిమా అయిన ‘దేవర’ నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం మా భాగస్వామ్యాన్ని ప్రకటించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము & గర్వంగా ఫీల్ అవున్నాం’ అంటూ పోస్ట్ పెట్టాడు కరణ్ జోహార్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. కరణ్ జోహార్ ‘దేవర’తో చేతులు కలుపుతున్నాడు అంటే బాలీవుడ్‌లో ఈ సినిమాకు బాయ్ కాట్ తప్పదేమో అంటూ భయపడుతున్నారు. కాగా ఈ మూవీ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

Next Story

Most Viewed