- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kangana Ranaut :మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కంగన..ఆ స్టోరీకి తను మాత్రమే న్యాయం చేయగలదట
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన అభిమానులతో మరో గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన అభిమానులతో మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె స్వీయదర్శకత్వంలో వస్తున్న ‘ఎమర్జెన్సీ’ ఈ యేడాది నవంబర్ 24న విడుదలకానుండగా.. ఈ మూవీ రిలీజ్‌కు ముందే మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. కాగా ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్న నటి.. ‘సందీప్ నేనూ 13ఏళ్లకు పైగా స్నేహితులం. కొంతకాలంగా ఇద్దరం కలిసి ఓ మంచి సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇన్నిరోజులకు మాకు సరైన స్టోరీ దొరికింది. పాత్రలు కూడా అద్భుతమైనవే. కాబట్టి దీనికోసం కొంతమంది ఉత్సాహవంతులం కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం’ అని చెప్పింది. ఇక దీనిపై స్పందించిన సందీప్.. ఏ మూవీకైనా స్ర్కిప్ట్ సిద్ధం చేయడం సవాలుతో కూడినపని అని చెప్పాడు. అలాగే కంగన మాత్రమే చేయగల కథ తన దగ్గర ఉందని, తమ ఇద్దరి కలయికలో వస్తున్న ప్రాజెక్టుతో ప్రేక్షకులు గొప్ప అనుభూతి పొందుతారని చెప్పాడు.
Read More: ‘ప్రాజెక్ట్ కే’ తొలి రోజే రూ.500 కోట్లు రాబడుతుంది: Bharadwaja Thammareddy






