ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తున్న కాజల్ హారర్ & థ్రిల్లర్ మూవీ..!

by Disha Web Desk 7 |
ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తున్న కాజల్ హారర్ & థ్రిల్లర్ మూవీ..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, బ్యూటీ ఫుల్ హీరోయిన్ రెజీనా ప్రధాన పాత్రల్లో నటించి తమిళ మూవీ ‘కరుంగాపియం’. కార్తికేయన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో ‘కార్తీక’ అనే పేరుతో గతేడాది జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ అండ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. తాజా సమాచారం మేరకు ఇప్పుడు తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

తెలుగులో ‘కార్తీక’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలియజేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది ఆహా. కాగా.. సినిమా కథ విషయానికి వస్తే.. రెజీనా ఓ పాత లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ ఆమెకు వందేళ్ల నాటి ‘కాటుక బొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. ఆ బుక్ చదవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అందులో ఉండే పాత్రలు ఆత్మలుగా రెజీనాకు కనిపిస్తా ఉంటాయి. అల తన ముందుకు వచ్చిన ఓ ఆత్మ కాజల్. గ్రామస్తుల కారణంగా మరణించిన కాజల్ వారిపై పగతో ఉంటోంది. ఆ పగ ఎలా తీరుతుంది. అందుకోసం రెజీనా ఏం చేస్తుందనేది సినిమా స్టోరి.

Next Story

Most Viewed