మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఎక్కువ మంది ఉపయోగిస్తున్న 10 కామన్ పిన్ నెంబర్లు ఇవే.. వెంటనే మార్చుకోండి

by prasad |
మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..  ఎక్కువ మంది ఉపయోగిస్తున్న 10 కామన్  పిన్ నెంబర్లు ఇవే.. వెంటనే మార్చుకోండి
X

దిశ, డైనమిక్ బ్యూరో:స్మార్ట్ ఫోన్లు వాడకంలోకి వచ్చాక సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి శ్రీమంతుల వరకు ఎవరిని వదలకుండా బురీడీ కొట్టిస్తూ అందినకాడికి దొచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ విషయంలో అప్రమత్తత చాలా ముఖ్యం అని లేకుంటే మోసపోవడం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లతో పాటు ఎలక్ట్రానికి డివైజ్ లకు సెట్ చేసుకునే సెక్యూరిటీ పిన్ నెంబర్ విషయంలో తాజాగా ‘ఇన్ఫర్మేషన్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే సంస్థ నిర్వహించిన సైబర్‌సెక్యూరిటీ అధ్యయనం షాకింగ్ న్యూస్ వెల్లడించింది. చాలా మంది యూజర్లు కామన్ సెక్యూరిటీ కోడ్ లను ఉపయోగిస్తున్నారని అవన్ని అత్యంత సాధారణమైన పిన్ నెంబర్లే అని చాలా మంది 1234 లేదా 0000 వంటి బలహీనమైన పిన్ నెంబర్లు లేదా వారి పుట్టిన రోజు వంటి వ్యక్తిగ సమాచారం ఆధారంగా సెట్ చేసుకుంటున్నారని తెలిపింది. ఇది భద్రత పరంగా సురక్షితం కాదని హెచ్చరించింది.

మోస్ట్ కామన్ 4 డిజిట్ పిన్ నెంబర్లు ఇవే:

ఎక్కువ మంది ఉపయోగిస్తున్న నాలుగు అంకెలతో కూడిన 10 కామన్ పిన్ నెంబర్లను ఈ నివేదిక వెల్లడించింది. మొత్తం 3.4 మిలియన్ పిన్‌ నెంబర్లను పరిశీలించగా అందులో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న వాటిలో 1234, 1111, 0000, 1212, 7777, 1004, 2000, 4444, 2222, 6969 ఉన్నట్లు వెల్లడైంది. కాగా వ్యక్తులు తమ వరకు వచ్చే వరకు రిస్క్ చేస్తారని ఇది మంది పద్దతి కాదని సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు జేక్ మూర్ సూచించారు. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, పాస్‌కోడ్‌లను హ్యాక్ చేయవచ్చని, అందువల్ల అదనపు భద్రత కోసం పాస్‌వర్డ్ మేనేజర్‌లను ఉపయోగించమని మూర్ సూచిస్తున్నారు.

Next Story