సీఏఏపై అసత్య ప్రచారం ద్వారా ప్రతిపక్షాలు అలజడులకు ప్రయత్నిస్తున్నాయి: ప్రధాని మోడీ

by S Gopi |
సీఏఏపై అసత్య ప్రచారం ద్వారా ప్రతిపక్షాలు అలజడులకు ప్రయత్నిస్తున్నాయి: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పౌరసత్వ (సవరణ) చట్టంపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పౌరసత్వ (సవరణ) చట్టంపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. తద్వారా దేశంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. గురువారం అజంఘర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడిన మోడీ.. సీఏఏ కింద శరణార్థులకు ఇప్పటికే భారత పౌరసత్వ సర్టిఫికేట్లు అందజేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రజలందరూ హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు. వారు దేశంలో చాలా కాలంగా శరణార్థులుగా నివసిస్తున్నారు. మతం ఆధారంగా దేశ విభజన జరిగిన కారణంగా దీర్ఘకాలం నుంచి వారు సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారికి భారత పౌరసత్వం అందజేస్తామని మోడీ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కావాల్సింది చేసుకోవచ్చు, ఇక ఎన్నటికీ సీఏఏను తొలగించలేరని మోడీ పేర్కొన్నారు. మహాత్మగాంధీ పేరు చెప్పి అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు గాంధీ చెప్పిన మాటలనే విస్మరించాయని మోడీ విమర్శించారు. పొరుగు దేశాల్లో నివశిస్తున్న మైనారిటీలు తాము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు భారత్‌కు రావొచ్చని గాంధీ చెప్పినట్టు మోడీ గుర్తుచేశారు. ఈ శరణార్థులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించిన మోడీ, కాంగ్రెస్, ఎస్పీలు సీఏఏ పేరుతో అసత్యాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వారు యూపీతో పాటు మొత్తం దేశాన్ని అలజడుల వైపు నెట్టేందుకు చూస్తున్నాయని ఆరోపించారు.

Advertisement

Next Story