బీసీలను రాజకీయ బానిసలుగా అణగదొక్కతారా?.. దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
బీసీలను రాజకీయ బానిసలుగా అణగదొక్కతారా?.. దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కులగణన పూర్తి చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలని, లేని పక్షంలో బీసీలను రాజకీయ బానిసలుగా అణగదొక్కినట్లేనని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. జూన్ ఫస్ట్ వీక్ లోనే లోకల్ బాడీ ఎన్నికలు అని సీఎం చెప్పినట్లు ఓ న్యూస్ చానెల్ వేసిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణపై తెలంగాణ సీఎంఓకు విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దామాషా పద్దతి ప్రకారం మేమెంతో మాకంత అన్నట్లు న్యాయబద్దమైన పూర్తి రిజర్వేషన్ కల్పించాలంటే, బీసీలలో ఉన్న అన్ని 113 సబ్బండ కులాలకు సమ న్యాయం జరగాలంటే.. కులగణన పూర్తి చేసిన తర్వాత మాత్రమే, కర్ణాటకలో మాదిరిగా స్థానిక సంస్థలలో బీసీ వర్గీకరణ చేసి, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సీఎంఓకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా దిగజార్చి, రాజకీయ బానిసలుగా అణగదొక్కినట్లే! అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story