నేను అందరినీ కొట్టడానికి కారణం అదే.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

యదార్థ సంఘటనలతో, సమాజంలో జరిగిన వాస్తవ కథను తెరపై ఆసక్తికరంగా చూపిస్తే ఆ చిత్రాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయి.

నేను అందరినీ కొట్టడానికి కారణం అదే.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యదార్థ సంఘటనలతో, సమాజంలో జరిగిన వాస్తవ కథను తెరపై ఆసక్తికరంగా చూపిస్తే ఆ చిత్రాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఇప్పుడు ఈ కోవలోనే యదార్థ సంఘటనలతో రూపొందిన ఓ వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా 'ఉసురే'(Usure). ఈ మూవీ ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీజయ్‌ అరుణాసలం(Teejay Arunasala), జననీ కునశీలన్‌ (Janani Kunashilan)హీరో, హీరోయిన్స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి నవీన్‌ డి.గోపాల్‌ దర్శకుడు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్‌ సమర్పణలో బకియా లక్ష్మీ టాకీస్‌ పతాకంపై మౌళి ఎం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నఈ సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌ రాశి (Raasi)కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా, ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా..సీనియర్‌ హీరోయిన్‌ రాశి మాట్లాడుతూ ''ఈ చిత్రంలో నా పాత్ర ఎలా ఉంటుందో ట్రైలర్‌ చూశారు.ఇందులో నేను హీరోని కొట్టాను.. హీరోయిన్‌ని కొట్టాను.. ప్రేయసిరావే మూవీలో హీరో శ్రీకాంత్‌ని కొట్టాను.. ఈ సినిమా హిట్‌ అయ్యింది. నాకున్న సెంటిమెంట్‌ ప్రకారం ఉసిరే కూడా హిట్‌. ఎందుకంటే నేను ఎవరిని కొడితే వాళ్ల సినిమా హిట్‌.. యదార్థ సంఘటనలతో రూపొందింది. దర్శకుడు మంచి విజన్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా కంటెంట్‌ బాగుంటుంది. నిర్మాత ప్రతి సీన్ చాలా రిచ్‌గా నిర్మించాడు. నా కూతురుగా నటించిన జననికి హీరోయిన్‌గా మంచి భవిష్యత్‌ ఉంది. హీరో కూడా ఎంతో నేచురల్‌గా కనిపిస్తాడు. మూవీలో మంచి ట్విస్ట్‌ ఉంది. నా పాత్ర చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ప్రాణం పెట్టి కష్టపడి చేశారు. నాకు కూడా ఈ సినిమా మంచి విజయాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను' అన్నారు.

Next Story