Krrish 4 BIG update : అందరం కలిసి ప్రార్థన చేద్దాం.. 'Krrish 4' గురించి Hruthik

by Prasanna |
Krrish 4 BIG update : అందరం కలిసి ప్రార్థన చేద్దాం.. Krrish 4 గురించి Hruthik
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన అప్‌కమింగ్ మూవీ 'క్రిష్ 4' కు సంబంధించిన బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మేరకు 'మనమందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేయాలి. 'క్రిష్ 4'కు అన్ని సిద్ధమయ్యాయి. కానీ చిన్న సాంకేతిక సమస్య వచ్చింది. దాన్ని ఈ ఏడాది చివరిలోపు అధిగమిస్తామని అనుకుంటున్నా. 'క్రిష్ 4' కచ్చితంగా నా జాబితాలో ఉంది. త్వరలోనే వెండితెర మీద సందడి చేస్తుంది' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలాగే 'క్రిష్ 4'లో మొదటి సినిమాలో కనిపించిన జాదూ కూడా కనిపిస్తాడనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్పందించిన హృతిక్.. 'జాదూ తిరిగి వస్తాడా లేదా అనేది సినిమాలో చూడండి. కానీ ఓ మ్యాజిక్ మాత్రం ఉంటుంది. అలాగే ఇందులో చాలా ఆశ్చర్యకరమైన, మీ ఊహకి అందని విషయాలు జరుగుతాయి' అంటూ సినిమాపై అంచనాలు పెరిగేలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చివరగా తనకు 'కోయి మిల్ గయా'లో చేసిన రోహిత్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమని, ఆ మూవీ చూసిన చాలామంది ఇంప్రెస్ అయ్యామని చెప్పడం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు.

ఇవి కూడా చదవండి :


'పేరులేని ఊరులోకి'.. ఆకట్టుకుంటున్న 'బుట్ట బొమ్మ' ఫస్ట్ సాంగ్!

ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన 'Kantara'

Next Story

Most Viewed