గృహలక్ష్మి: ఇంట్లో వాళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్న అంటున్న లాస్య

by Disha Web Desk 10 |
గృహలక్ష్మి: ఇంట్లో వాళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్న అంటున్న లాస్య
X

దిశ, వెబ్ డెస్క్ : నేటి గృహలక్ష్మి ఎపిసోడ్‌లో ఈ సీన్లు హైలెట్

లాస్య ఈ విధంగా ఆలోచిస్తూ..ఇదంతా కావాలనే చేస్తున్నారు.. నా టైం బాలేదు.. అనుకుని.. 'మీకు ఏ అవసరం ఉన్నా నాకే చెప్పండి.. నేను మీకు ఏదయినా చేస్తానని మాట ఇస్తుంది. ఈ మాటలు విన్న పరంధామయ్య.. తులసితో లాస్యను పోల్చుతూ ఒక రేంజులో ఇస్తాడు..తిక్క తిక్క వేషాలు వేసే అనసూయ కూడా పరంధామయ్య వైపు మాట్లాడుతుంది. అదే సమయానికి తులసి ఫోన్ చేస్తుంది. అందరు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు.

ఫోన్ తీసుకోని నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నామని చెబుతారు..ఇక్కడ ఇంట్లో వాళ్ల యాక్షన్ మాములుగా ఉండదు.. ఒకరి తర్వాత ఒకరు ఫోన్ లో మాట్లాడుతుంటారు. వీళ్ళ వేషాలు చూస్తూ లాస్య.. పెద్ద సెలెబ్రెటీతో మాట్లాడినంత షో చేస్తున్నారుగా.. చూడలేక చస్తున్నా అని మనసులో అనుకుంటుంది. అప్పుడు తులసి ఈ విధంగా 'నాకూ మీ దగ్గరకు రావాలనే ఉంది..కానీ ఆఫీస్‌ పనులు ఉండటం వల్ల రాలేకపోతున్నానని చెబుతుంది. ఇక అందరు ఒకేసారి తులసి బై చెప్పి ఫోన్ పెట్టేస్తారు.

కథ ఇలా సాగుతూ ఉండగా .. ఇద్దరు సామ్రాట్ , తులసి ఒకరికొకరు ఛాలెంజ్ పెట్టుకుంటారు.. మీరు గొప్పా లేక మేము గొప్పా అని..దొరికిందే అవకాశం అనుకొని సామ్రాట్ తులసిని బుట్టలో పడేయడానికి చూస్తూ ఉంటాడు.తరవాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.


Next Story

Most Viewed