తల్లిగా ఇంతకంటే భయంకరమైన అనుభవం మరొకటి ఉండదు: గౌరీ

by Disha Web Desk 6 |
తల్లిగా ఇంతకంటే భయంకరమైన అనుభవం మరొకటి ఉండదు: గౌరీ
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ తమ కొడుకు డ్రగ్స్ కేసుపై మొదటిసారి స్పందించింది. ఇటీవల 'కాఫీ విత్ కరణ్ షో'కు హాజరైన ఆమె.. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు అయినప్పుడు కుటుంబం మొత్తం చాలా ఇబ్బంది పడినట్లు తెలిపింది. అయినప్పటికీ వాటన్నింటిని తట్టుకుని నిలబడగలిగామని, ఆ కష్ట సమయం గుర్తొస్తే కన్నీళ్లు ఆగవని చెప్పింది. 'కుటుంబమంతా చాలా బాధపడ్డాం. తల్లిగా నాకు ఇంతకంటే భయంకరమైన అనుభవం మరొకటి ఉండదు. ఇండస్ట్రీ అందరం ఓ కుటుంబంగా కలిసి సమస్య నుంచి బయటపడగలిగాం. అంతేకాదు.. అందరూ ప్రేమించే, అభిమానించే స్థానంలో ఉన్నామని బాగా తెలుసు. అందుకే ఎంతోమంది మేస్సేజ్‌లు, కాల్స్ ద్వారా పలకరించి ఓదార్చారు. దానికి అదృష్టవంతులమనే ఫీల్ అవుతున్నా. ఇలాంటి కష్ట సమయాల్లో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్‌ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Also Read: తండ్రి లేకుండా జీవించడం అంత ఈజీ కాదు: సోహా అలీ ఖాన్

Next Story