యాడ్ ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్‌పై సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk |
యాడ్ ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్‌పై సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, అంబర్ పేట్: యాడ్ ఫిల్మ్స్ మేకింగ్ వర్క్ షాప్ ఔత్సాహిక కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో రవీంద్ర భారతి, పైడి జయరాజ్ రివ్యూ థియేటర్‌లో భాషా సాంస్కృతిక శాఖ, జీఎన్ఆర్ యాడ్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వర్క్ షాప్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ సభ రవీంద్ర భారతి పైడి జయరాజు రివ్యూ థియేటర్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయేంద్ర ప్రసాద్ హాజరై వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాడ్ ఫిల్మ్ నిర్మాణం శాస్రీయంగా రూపొందించినప్పుడు ఔత్సాహికులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణ భాష, సంస్కృతి శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. వర్క్ షాప్‌లో సీట్లు పరిమితంగా ఉన్నాయని, వర్క్ షాప్‌లో పాల్గొనే కళాకారులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9014198366, 7661085248, 9392462676 నెంబర్లను సంప్రదించాలని కోరారు.


Next Story

Most Viewed