#NTR30 అప్‌డేట్.. అభిమానులకు చెమటలు పట్టిస్తున్న న్యూ పోస్టర్..

by Disha Web Desk 17 |
#NTR30 అప్‌డేట్.. అభిమానులకు చెమటలు పట్టిస్తున్న న్యూ పోస్టర్..
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్'తో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయికి చేరుకుంది. దీంతో కొరటాల శివ తో చేస్తున్న తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు.. తారక్ బర్త్ డే సందర్భంగా ప్రీ లుక్ రిలీజ్‌తో ఖుష్ అవుతున్నారు.

రేపు రివీల్ అయ్యే ఫస్ట్ లుక్ అభిమానుల అంచనాలను అందుకునేలా ఉంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే అవుట్ అండ్ అవుట్ మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నిండిన సినిమాను.. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Next Story

Most Viewed