మా పొరపాటు వల్ల కొన్ని కోట్ల నష్టం వచ్చింది.. బన్నీ వాసు షాకింగ్ రియాక్షన్! (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-30 09:04:09  IST  )

విజయేందర్(Vijender) దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మిత్రమండలి’(Mithra Mandali).

మా పొరపాటు వల్ల కొన్ని కోట్ల నష్టం వచ్చింది.. బన్నీ వాసు షాకింగ్ రియాక్షన్! (వీడియో)
X

దిశ, సినిమా: విజయేందర్(Vijender) దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మిత్రమండలి’(Mithra Mandali). నటుడు ప్రియదర్శి(Priyadarshi), నిహారిక జంటగా నటించగా.. వెన్నెల కిశోర్, సత్య, విష్ణు, రాగ్ మయూర్, బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మించారు. అయితే ఈ మూవీకి సమర్శకులుగా బన్నీ వాసు (Bunny Vasu)ఉన్నారు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయినప్పటికీ.. అక్టోబర్ 16న థియేటర్స్‌లోకి వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. 20 రోజుల్లో ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ కేవలం రూ. 9 కోట్ల మాత్రమే రాబట్టడంతో మేకర్స్ భారీ నష్టాలు వచ్చాయి.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ వాసు ‘మిత్రమండలి’ ఫ్లాప్ అవడంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘సినిమా పూర్తి అయిన తర్వాత ఎడిటింగ్ రూమ్‌లో అందరం చూశాం. చాలా బాగుందని అనిపించింది. థియేటర్స్‌లలో ప్రేక్షకులు కూడా నవ్వుతూ బాగా ఎంజాయ్ చేస్తారని అనుకున్నాం. కానీ ఎక్కడో పొరపాటు జరగడం వల్ల ప్రేక్షకులతో పాటు నేను కూడా సినిమా చూశాను. వారిలో నవ్వు అనేది కనిపించలేదు. నేను అంచనా పెట్టుకున్న సీన్లు కూడా మెప్పించలేకపోయాయి. తొలిసారి మా అంచనా తప్పు అయింది. అయితే ఎడిటింగ్ పొరపాటు చేశామని తర్వాత మాకు అర్థమైంది. ఫైనల్ కాపీని విడుదలకు ముందు మరోసారి చూసుకొని ఉండాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అలా చేయడం కుదరలేదు. అందుకే మా ‘మిత్రమండలి’ సినిమా దాదాపు 6 కోట్లు నష్టాలు తెచ్చింది’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి ఆయన తప్పు ఒప్పుకోవడం గమనార్హం.

Next Story