Rajendra Prasad: థియేటర్స్ బంద్ విషయంలో నేను పవన్‌కు సపోర్ట్ చేస్తున్నా అనుకోవద్దు.. రాజేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-28 12:54:08  IST  )

రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ కానున్నట్లు గత కొద్ది రోజుల నుంచి పలు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Rajendra Prasad: థియేటర్స్ బంద్ విషయంలో నేను పవన్‌కు సపోర్ట్ చేస్తున్నా అనుకోవద్దు.. రాజేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, సినిమా: రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ కానున్నట్లు గత కొద్ది రోజుల నుంచి పలు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘హరిహరి వీరమల్లు’(Harihari Veeramallu) విడుదల నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడంతో పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎవరో కావాలనే చేయిస్తున్నారని పలు చర్చలు జరిగాయి. ఇక ఇందులో ఓ నలుగురు వ్యక్తులు కూడా ఉన్నట్లు పుకార్లు షికారు చేశాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ నిర్మాతలు స్పందించారు. ఇక ఈ విషయంపై ఇటీవల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో భాగస్వామిగా ఉన్న సత్యనారాయణను జనసేన పార్టీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తొలగించారు. తాజాగా, ఈ విషయంపై నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) ‘షష్టిపూర్తి’ప్రీరిలీజ్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ ఫీల్ అయ్యాడంటే అది రైటే అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘థియేటర్లు మూసేయడం అనేది ఒకరు చెబితే చేసేది కాదు. అది కలిసి సమిష్టిగా తీసుకోవాల్సి నిర్ణయం. దీన్ని ఎవరో మిస్ గైడ్ చేశారు. చివరకు ఏమైంది.. అది నిలబడలేదు. పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యాడంటే అది సరైనది అవుతుంది. ఆయన అనుకొని ఉండొచ్చు.. నా సినిమా ముందు ఇలా జరిగింది అనుకోవచ్చు. దానికి కారకులు ఎవరైనా సరే పట్టకోవాలి. ఇలాంటివి సృష్టించిన వారిని కనిపెడితే ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పడుతుంది. థియేటర్లను బంద్ చేస్తాం అనే మాట చిన్నది కాదు. ఇలాంటివి ఇంకెప్పుడూ జగడకూడదని కోరుకుంటున్నాను.

పవన్ ఈ విషయంలో బాధ్యత తీసుకొని దీని వెనుక ఎవరున్నారో కనిపెట్టాలని కోరుతున్నాను. నేను అతనికి సపోర్ట్ చేస్తున్నాను అనుకోవద్దు. అతను ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి తెలుసుకోవాల్సిన బాధ్యత అతనికి ఉంది తెలుసుకోవాలని అంటున్నా’’ అని చెప్పుకొచ్చారు. కాగా, రాజేంద్ర ప్రసాద్ ‘షష్టిపూర్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఇందులో అర్చన, ఆకాంక్ష సింగ్, రూపేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మా అయి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా మే 30న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

Next Story