- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తారకరత్న భార్య కోసం జూనియర్ ఎన్టీఆర్ భార్య ఏం చేసిందో తెలుసా?
నందమూరి మోహన్ కృష్ణ తనయుడు తారకరత్న మృత్యువుతో పోరాడి చివరకు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

దిశ, వెబ్డెస్క్ : నందమూరి మోహన్ కృష్ణ తనయుడు తారకరత్న మృత్యువుతో పోరాడి చివరకు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.
ఇక తారకరత్న భార్య పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమించి పెళ్లి చేసుకొని,ఎంతో ఇష్టపడే భర్త చనిపోవడంతో ఆమె ఒక్కసారిగా షాక్ గురైంది. ఇంకా ఆమె విషాద ఘటన నుంచి బయటపడటం లేదంట.
తారకరత్న అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా రోజులు కుటుంబానికి దూరంగా ఉన్నారు. వారికి ఓ పాప పుట్టిన తర్వాత నందమూరి ఫ్యామిలీకి దగ్గరయ్యారు. అంతా సర్దుకుంది, ఆనందంగా ఉన్నాం అనుకునే సమయానికి ఆయన తన కుటుంబానికి దూరమయ్యారు. దీంతో నందమూరి కుటుంబం ఫ్యామిలీకి అండగా నిలుస్తోంది, ఇప్పటికే తారకరత్న పిల్లల బాధ్యతను తాను చూసుకుంటానని బాలయ్య ముందుకు వచ్చాడు.
కాగా,ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి తారకరత్న భార్య విషయంలో ఓ డెసిషన్ తీసుకుందట.ప్రణతి చాలా సాప్ట్ మైండెడ్, ఎవరినీ కూడా హర్ట్ చేయదు. గట్టిగా మాట్లాడదు. తన పని ఏంటో తాను చూసుకొని వెళ్తుంది. అయితే తారకరత్న మరణించడంతో ఆయన భార్య ఆ బాధ నుంచి ఇంకాబయటపడం లేదంట. దీంతో ఆమె బాధను పొగొట్టడానికి ప్రణతి చాలా ప్రయత్నం చేస్తుందంట. తన పిల్లల కోసం బతకాలంటూ ఆమెను మోటివేట్ చేస్తుందంట.తారకరత్న భార్య విషయంలో ఎన్టీఆర్ భార్య ప్రణతి తీసుకుంటున్న కేరింగ్ ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇవి కూడా చదవండి: RRR Movie : క్రెడిట్ మొత్తం రామ్ చరణ్ కేనా? మరి jr.Ntr పరిస్థితి ఏంటి ?






