ఎన్టీఆర్ సినిమాపై కాంట్రవర్శీ.. అలాంటి క్యారెక్టర్ నాది కాదంటూ డైరెక్టర్ సీరియస్ పోస్ట్

by Disha Web Desk 7 |
ఎన్టీఆర్ సినిమాపై కాంట్రవర్శీ.. అలాంటి క్యారెక్టర్ నాది కాదంటూ డైరెక్టర్ సీరియస్ పోస్ట్
X

దిశ, సినిమా: ఎన్టీఆర్ హీరోగా పదేళ్ల క్రితం వచ్చిన సినిమా ‘రామయ్య వస్తావయ్య’. ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. అప్పట్లో ఈ సినిమా ఆడియన్స్‌ను అంతగా ఆకట్టుకోక పోవడంతో.. డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ మధ్య వార్ నడుస్తుంది. పదేళ్ల క్రితం వచ్చిన సినిమా ఫెయిల్యూర్‌పై ఇప్పుడు మీడియా ముఖంగా కాంట్రవర్శీ జరుగుతోంది. అసలు ఏం జరిగందంటే..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ‘రామయ్య వస్తావయ్య’ మూవీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాడు. మూవీ షూటింగ్ సమయంలో జరిగిన సంగతులు చెప్తూ.. ‘సెట్‌లో నాకు, దర్శకుడు హరీష్ శంకర్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. తనకు ఉన్న అనుభవంతో కొన్ని సలహాలు ఇచ్చాను. కానీ వాటిని డైరెక్టర్ పట్టించుకోలేదు. దీంతో ఆయన ఏది చెబితే అదే తీశాను. కానీ సినిమా హిట్ అవ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై డైరెక్టర్ హరీస్ శంకర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఓ నోట్ విడుదల చేశాడు.

‘చోటా కె నాయుడుకి నమస్కరిస్తూ.. రామయ్య వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు దశాబ్ధం దాటింది. ఈ పదేళ్లలో మీరు పది ఇంటర్వ్యూలు ఇస్తే.. నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటాను. కానీ ఎప్పుడూ ఎక్కడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదు.. మీరు నా గురించి చాలాసార్లు అవమానకరంగా మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరా మెన్‌తో షూటింగ్ చేద్దాం అనుకున్నాం. కానీ దిల్ రాజు చెప్పడం వల్ల.. అలాగే గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్‌ను తీసేస్తున్నాడని పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటారని భయంతో మీతో సినిమా పూర్తి చేశాను. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ఏరోజు ఆ నింద మీపై వేయలేదు.

సినిమా హిట్ అవుతే నాది.. ప్లాప్ అయితే వేరేవాళ్లది అని చెప్పే క్యారెక్టర్ నాది కాదు. కానీ మీరు ఎదుటివారు అడిగినా అడకపోయినా నా గురించి ప్రస్తావన రాకపోయినా అవమానించేలా మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు మౌనంగానే ఉన్నాను. కానీ నా అన్నవాళ్లు నా ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈరోజు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మీతో పని ఇబ్బంది కలిగినా.. మీ అనుభవం నుంచి కొన్ని నేర్చుకున్నాను. అందుకే మీరంటే నాకు గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకోండి. లేదు ఇంకా అలాగే మాట్లాడతా అంటే నేను ఎక్కడికైనా వస్తా డిబెట్ కు.. భవదీయుడు హరీశ్ శంకర్’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Read More..

విడాకులు తీసుకోబోతున్న ఐశ్వర్య, అభిషేక్..! ఆ ఒక్క పోస్ట్‌తో క్లారిటీ



Next Story

Most Viewed