Chiranjeevi : చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్ సెట్‌లో పవన్ కళ్యాణ్ సందడి.. ఒకే వేదికపై మెరిసిన మెగా బ్రదర్స్ !

by Dishafeatures2 |
Chiranjeevi : చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్ సెట్‌లో పవన్ కళ్యాణ్ సందడి.. ఒకే వేదికపై మెరిసిన మెగా బ్రదర్స్ !
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్‌గా తెరకెక్కుతున్న మాసివ్ ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. ప్రముఖ దర్శకుడు వశిష్ట దీనిని తెరకెక్కిస్తున్నారు. ఓ వైపు ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంగా, మరోవైపు షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతోంది. ఇక ఇందులో పాటలకు సంబంధించి ఆస్కార్ గ్రహీత ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌ అంచనాలతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తేవాలని మేకర్స్ ఇప్పటికీ తగిన ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.

ఇకపోతే చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ ఆశలు, అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర వీడియో, ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇంతకీ ఇందులో ఏముందంటే.. షూటింగ్ సెట్‌లోకి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటుడు నాగబాబు కలిసి కలిసి వచ్చారు. ఒకేచోట ముగ్గురు మెగా బ్రదర్స్ కనిపొంచడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. విశ్వంభ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు.


Next Story

Most Viewed