బెస్ట్ కపుల్.. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా

by Disha Web Desk 21 |
బెస్ట్ కపుల్.. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా
X

దిశ, సినిమా : జయంత్ వదాలి, శగ్న శ్రీ, చలాకి చంటి, ఇమ్మాన్యయేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'బెస్ట్ కపుల్'. వన్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పార్థు రెడ్డి నిర్మించిన చిత్రం ఈ నెల 18న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన నిర్మాత.. రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా అందరినీ అలరిస్తుందన్నాడు.

ఇక మూవీ యూనిట్ సభ్యులు మాట్లాడుతూ కంటెంట్ కొత్తగా ఉంటే తప్పకుండా అభిమానులు ఆదరిస్తారని, అదే కోవలో 'బెస్ట్ కపుల్' మంచి విజయం సాధిస్తుందన్నారు. ఇక భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలు, గొడవలు, ప్రేమాభిమానాలు ఈ సినిమాలో పొందుపరిచామన్న డైరెక్టర్ గణేష్ దోర అందరికీ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి : ప్రేమకథా చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్‌గా 'సీతారామపురం'



Next Story

Most Viewed