- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుష్క మరో ప్రయోగం...టాలీవుడ్ కుర్ర హీరోతో సినిమా ?
మరో కుర్ర హీరోతో కొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యారట అనుష్క.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే పాపులారిటీ వస్తుంది. అలాంటి వారిలో అనుష్క ఒకరు. సౌత్ ఇండియా సినిమాకు ఆమె ఒక మహారాణిలా కొనసాగుతున్నారు. భాష ఏదైనా సరే... అదిరిపోయే పాత్రలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అరుంధతి నుంచి మొదలుకొని మొన్నటి ఘాటి సినిమా వరకు అదిరిపోయే సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు అనుష్క. అయితే అనుష్క త్వరలో మరో కొత్త ప్రాజెక్టు ఓకే చేసినట్లు చెబుతున్నారు.
కుర్ర హీరోతో అనుష్క సినిమా ?
నవీన్ పోలిశెట్టితో అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసిన సంగతి తెలిసిందే. అలాంటి తరహాలోనే మరో కుర్ర హీరోతో కొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యారట అనుష్క. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఓ యంగ్ హీరోతో అనుష్క శర్మ ఈ కొత్త సినిమా చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా వస్తుందని ప్రచారం అయితే సాగుతోంది. మే చివరలో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫ్యామిలీ, కామెడీ జోనర్ లో వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా పూర్తి వివరాలు బయటకు రాలేదు కానీ, నిన్నటి నుంచి జోరుగా ప్రచారం అయితే సాగుతోంది.






