పాకిస్తాన్‌లో హాలీవుడ్ నటి.. వాళ్లకు సాయం చేయడానికే

by Disha Web Desk 6 |
పాకిస్తాన్‌లో హాలీవుడ్ నటి.. వాళ్లకు సాయం చేయడానికే
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలకు సాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో ఎంతటి ప్రమాదకరమైన స్థలానికి వెళ్లాడానికైనా వెనకాడని ఆమె.. ఇటీవల ఉక్రెయిన్‌కి వెళ్లి తనవంతు హెల్ప్ చేసి తన మంచి మనసు చాటుకుంది. అయితే తాజాగా పాకిస్తాన్‌‌లో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో వేల మంది సొంత ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా.. మరెంతో మంది నిరాశ్రయులై సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు సాయం చేయాలని నిర్ణయించుకున్న నటి.. యునైటెడ్ నేషన్స్ తరపున పాకిస్తాన్‌కి వెళ్లింది. ఈ మేరకు పాకిస్తాన్ విమానాశ్రయంలో మీడియా కంటపడిన జోలీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ బ్యూటీ 2005 భూకంపం, 2010లో వరదలు ముంచెత్తిన సమయంలో పాక్‌ను సందర్శించడం విశేషం.

ఇవి కూడా చ‌ద‌వండి :

సమంతను రెండో పెళ్లికి ఒప్పిస్తుంది ఎవరో తెలుసా?


Next Story

Most Viewed