Liger Dance: క్రేజీ స్టెప్స్ తో లైగర్ జోడీ..

by Disha Web |
Liger Dance
X

దిశ, వెబ్‌డెస్క్: Ananya Panday, vijay devarakonda liger dance video viral on social media| డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్(Liger) సినిమాలో హీరోహీరోయిన్ గా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)- అనన్య పాండే(Ananya panday) నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి 'లైగర్' సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో మెల్లగా చిత్ర ప్రమోషన్స్ షురూ చేస్తున్న చిత్ర యూనిట్ ఒక్కో అప్‌డేట్ బయటకు వదులుతూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అనన్య- విజయ్ దేవరకొండ జోడీ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. విజయ్‌తో డాన్స్ చేసిన ఈ వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అనన్య పాండే. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. లైగర్ సినిమా విడుదలకు ముందే ఇలా అనన్య- విజయ్ దేవరకొండ జోడీ డాన్స్ చూసి ఫిదా అవుతున్నారు ఇరువురి ఫ్యాన్స్. రకరకాల కామెంట్లతో సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు.

Next Story

Most Viewed