- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యాన్స్ ఓవరాక్షన్.. బన్నీ భార్యకు ఘోర అవమానం !
అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడడంతో, ఆమె కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. సెల్ఫీల కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎగబడడంతో, ఆమె కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీలు బయటకు వస్తే, ఫ్యాన్స్ ఎగబడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న నిధి అగర్వాల్, హీరోయిన్ సమంత, విజయ్ దళపతి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా నిధి అగర్వాల్ అయితే చుక్కలు చూశారు. ఆమె కారు ఎక్కే వరకు మీద మీద పడిపోయారు. అయితే ఇప్పుడు అచ్చం అలాంటి సంఘటనే అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎదురైంది. వీకెండ్ కావడంతో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ రెడ్డి ఇద్దరు హైటెక్ సిటీలోని నీలోఫర్ కేఫ్ కు వెళ్లారు. ఇక అక్కడి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో సెల్ఫీల కోసం ఫాన్స్ ఎగబడ్డారు. దీంతో అతి కష్టం మీద నీలోఫర్ కేఫ్ నుంచి బయటకు వచ్చారు అల్లు అర్జున్, స్నేహ రెడ్డి. వాళ్లను కారు ఎక్కనివ్వకుండా సెల్ఫీల కోసం ఎగబడ్డారు జనాలు. ఈ సందర్భంగా స్నేహ రెడ్డి కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఘటన వైరల్ గా మారింది. క్లిక్






