65 ఏళ్ళ తెలుగు హీరోతో క‌త్రినా కైఫ్ రొమాన్స్ ?

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా నాగార్జున ( Nagarjuna) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 65 సంవత్సరాలు దాటినప్పటికీ

65 ఏళ్ళ తెలుగు హీరోతో క‌త్రినా కైఫ్ రొమాన్స్ ?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా నాగార్జున ( Nagarjuna) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 65 సంవత్సరాలు దాటినప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా నాగార్జున సినిమాలు తీస్తున్నారు. ఇటీవల.. కుబేర సినిమాలో గెస్ట్ పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులను అలరించారు అక్కినేని నాగార్జున. అయితే అలాంటి అక్కినేని నాగార్జున త్వరలోనే తమిళ దర్శకుడు కార్తీక్ తో సినిమా చేయబోతున్నారు.

ఈ సినిమా నాగార్జున కెరియర్ లో 100వది కానుంది. ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని... ఆచితూచి కార్తీక్ కు చాన్స్ ఇచ్చారు అక్కినేని నాగార్జున. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటి..? ఏ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) పేరు తెరపైకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ మేరకు చిత్ర బృందం కత్రినా కైఫ్ ను కలిసినట్లు కూడా చెబుతున్నారు. నాగార్జున రేంజ్ కు బాలీవుడ్ హీరోయిన్ అయితేనే సెట్ అవుతుందని... కత్రినా కైఫ్ ను ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ అలాగే కత్రినా కైఫ్ కాంబినేషన్ లో మల్లీశ్వరి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్ అయింది. అందుకే కత్రినా కైఫ్ ను... అక్కినేని నాగార్జున సినిమాలో తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనికి కత్రినా కైఫ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

Next Story