ఫుల్లుగా మద్యం తాగిన అమీర్ ఖాన్.. సోషల్ మీడియా ఫొటోలు వైరల్..

by Disha Web Desk 7 |
ఫుల్లుగా మద్యం తాగిన అమీర్ ఖాన్.. సోషల్ మీడియా ఫొటోలు వైరల్..
X

దిశ, వెబ్‌డెస్క్: సెలబ్రిటీలకు సంబంధించిన న్యూస్ నిత్యం ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు ఉండే దానికంటే కొంచెం డిఫరెంట్‌గా కనిపించిన నటీనటుల ఫొటోలు నెట్టింట రచ్చ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో అమీర్ ఖాన్. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ కెరీల్లో చాలా హిట్స్ అందుకున్న అమీర్ ఖాన్.. సంవత్సరం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. గతేడాది వచ్చిన లాల్ సింగ్ చద్దా మూవీ డిజాస్టర్‌గా మిగలడంతో అమీర్ ఖాన్ చాలా డల్లయ్యడని టాక్. ఈ క్రమంలోనే స్క్రీన్ ముందు దర్శనమివ్వడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా కెమెరాకు చిక్కిన అమీర్ ఖాన్ ఫొటోస్ నెట్టింట కొత్త రచ్చకు దారి తీశాయి. ఆ ఫొటోల్లో అమీర్ ఖాన్ ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఓ ఈవెంట్‌ నుంచి ఆయన ఫొటోలు లీక్ కావడంతో నెట్టింట తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు అమీర్ ఖాన్. మరి ఇవి నిజమైనవేనా.. కావా అనేది తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed